Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గుర్రంగూడలో సంజీవని వనం

హైదరాబాద్‌ మహానగర వాసులకు మరో అటవీ ఉద్యానవనం (అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఎల్‌బీ నగర్‌ నుంచి నాగార్జున సాగర్‌కు వెళ్లే దారిలో గుర్రంగూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరిట ఏర్పాటయింది.


రాష్ట్రంలో 77 పార్క్‌లు..
గుర్రంగూడ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అటవీ శాఖ అభివృద్ది చేసిన అర్బన్‌ పార్క్‌ ఎల్‌ బీ నగర్, బీ.ఎన్‌.రెడ్డి నగర్, తుర్కయంజాల్, నాదర్‌ గుల్, మన్నెగూడ పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనుంది. 2015లో సంజీవని వనం పేరుతో సాహెబ్‌ నగర్‌ లో ఉన్న అటవీ పార్కుకు అదనంగా ఈ కొత్త పార్కును అటవీ శాఖ ఏర్పాటు చేసింది.  వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లతో పాటు, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్‌ స్పాట్, అక్కడే వంట చేసుకుని వీలుగా ప్రత్యేక ప్రాంతాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేశారు. పిల్లలకు సాహస క్రీడలు, రాశివనం, నక్షత్ర వనం, తక్కువ ప్రాంతంలో ఎక్కువ పచ్చదనం పెంచే మియావాకి అటవీ పెంపకాన్ని ఈ కొత్త పార్కులో అటవీ శాఖ ప్రత్యేకంగా అభివృద్ది చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 అటవీ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు  పీసీసీఎఫ్‌ పీకే ఝా వెల్లడించారు.

Related Posts

Latest News Updates