కన్జ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ ఉషా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి రేసర్ పేరిట నూతన శ్రేణి ఫ్యాన్లను విడుదల చేసింది. అలాగే ఈ ఫ్యాన్లకు ఫార్ములా వన్ డ్రైవర్ నిరంజన్ కార్తికేయన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. రేసర్ పంకాలు అల్ట్రా హై స్పీడ్ బ్లేడ్ల కారణంగా 400 ఆర్పీఎం స్థాయిలో గాలి వస్తుందని కంపెనీ తెలిపింది. తెలుపు, బ్రౌన్, ఐవోరీ, బ్లూ, రెడ్ ఐదు రంగుల్లో లభ్యమవుతాయి. ప్రారంభ ధర రూ.1,750.