Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

వాస్తు – ఇంటీరియర్‌

భారతీయులకు సొంతిల్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది వాస్తు. ఇల్లు, ఇంట్లోని సభ్యులకు ఆరోగ్యం, సంపద సిద్ధించాలంటే వాస్తు తప్పనిసరిగా పాటించాలనేది నమ్మకం. అందుకే ఇల్లే కాదు ఇంటీరియర్‌ ఏర్పాట్లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
– ఇంటి ఎంట్రెన్స్‌ వాస్తు ప్రకారం రూపొందించినప్పుడే ఇంటి యజమానికి ఆనందం, ఆరోగ్యం కలుగుతాయి. ప్రవేశ ద్వారం ఉత్తర లేదా తూర్పు దిశగా ఏర్పాటు చేసుకోవటం. ప్రధాన ద్వారాన్ని కలపతో చేయించడం శ్రేయస్కరం. ప్రవేశ ద్వారం వద్ద విండ్‌చిమ్స్‌ ఏర్పాటు చేసుకుంటే సంపద వస్తుందని నమ్మకం. బెడ్‌ రూమ్‌లో లేదా నిద్రించే చోట వీటిని ఏర్పాటు చేస్తే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. పాజిటివ్‌ వాతావరణాన్ని కల్పించాలంటే ఎంట్రెన్స్‌ స్పేస్‌ ఎక్కువగా ఉండాలి. ప్రధాన ద్వారం ముందు పాదరక్షలు, బూట్లు వంటివి విడవకూడదు.
– ప్రశాంతమైన నిద్ర మనలోని పాజిటివ్‌ కోణాన్ని నిద్రలేపుతుంది. అందుకే పడక గదిలోని ఇంటీరియర్‌ ఏర్పాట్లపై శ్రద్ధ పెట్టాలి. ప్రతి రోజు ఉదయం లేవగానే కనీసం 20 నిమిషాల పాటైన బెడ్‌ రూమ్‌ తలుపులు, కిటికీలను తెరిచి ఉంచాలి. స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. నిద్రించే సమయంలో తలను దక్షిణం దిశగా పెట్టి పడుకుంటే సంపద సిద్ధిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
– శాంతికి, సామరస్యానికి సూచిక లాఫింగ్‌ బుద్ద. డ్రాయింగ్‌ రూమ్, కిచెన్‌ లేదా గార్డెన్‌లో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవటం మంచిది. పెద్ద సైజ్‌ లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే సానుకూల శక్తి ఆకర్షిస్తుందని నమ్మకం.
– వాస్తు పెయింటింగ్స్‌ అదృష్టాన్ని తీసుకొస్తాయని నమ్మకం. జలపాతం, గోల్డ్‌ ఫిష్‌ వంటి పర్యావరణహితమైన చిత్రాలు పెట్టుకోవటం ఉత్తమం. విదేశీ కెరీర్‌ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లయితే ఫారన్‌ కరెన్సీ, ఎగిరే పక్షులు, రేసింగ్‌ బైక్స్, కార్స్‌ వంటి పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేసుకుంటే మనలో ప్రేరణ శక్తి రెట్టింపు అవుతుంది.
– వాస్తు ఆధారిత ఇంటీరియర్‌లో మనీ ప్లాంట్‌ కూడా ప్రధానమైందే. ఉత్తర దిశలో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే అదృష్టం, శ్రేయస్కు కలుగుతాయి. బ్యాంబూ ప్లాంట్‌ లేదా దట్టమైన అడవి పెయింటింగ్స్‌ సంపదను తీసుకొస్తాయి. ఆర్ధిక స్థిరత్వం ఉండాలంటే ఇంట్లో అక్వెరియం ఏర్పాటు చేసుకోవాలి. లివింగ్‌ రూమ్‌లో అయితే ఆగ్నేయ దిశలో, ఇతర గదుల్లో అయితే ఉత్తర దిశలో అక్వెరియంను ఏర్పాటు చేయాలి. దీంతో విజయం సిద్ధిస్తుంది.

Related Posts

Latest News Updates