అమెరికాకు చెందిన కో–వర్కింగ్ స్పేస్ కంపెనీ వీవర్క్.. హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించింది. కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల్లో రెండు లక్షల చ.అ.ల్లో రెండు కో–వర్కింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటిలో 15 వేల డెస్క్‌లు, 7 వేల సీట్లున్నాయి. అద్దె ఒక్క సీట్‌కు నెలకు రూ.7–8 వేలు. వీవర్క్ ఇండియా కో–సీఈఓ రైన్ బెన్నెట్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌తో కలిసి మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎంబసీ గ్రూప్‌తో ఒప్పందంతో 2017లో దేశీయ కో–వర్కింగ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వీవర్క్కు ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటూ బెంగళూరు, ముంబై, ఎన్సీఆర్, గుర్గావ్, పుణే నగరాల్లో 32 ప్రాంతాల్లో 55 వేల డెస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ‘‘ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగిసే నాటికి వీవర్క్ 33 దేశాల్లో 625 ప్రాంతాల్లో 6.90 లక్షల సభ్యులను కలిగి ఉంది. ఇందులో 43 శాతం ఎంటర్‌ప్రైజ్‌లు కాగా.. 57 శాతం స్టార్టప్స్, ఫ్రీలాన్సర్స్ ఉన్నారని’’ బెన్నెట్ వివరించారు. ప్రస్తుతం దేశంలో 2.1 కోట్ల కో–వర్కింగ్ సీట్లున్నాయి. వీటిలో 45 లక్షల సీట్లు వీవర్క్ చేతిలో ఉన్నాయి. కో–వర్కింగ్ పరిశ్రమలో 25 శాతం మార్కెట్ వాటా ఉంది.