పేదల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి బీఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన దార్శనికత వల్లే నేడు దళిత, గిరిజన, బహుజన వర్గాలతో పాటు సకల జనులకు ఆర్థిక, సామాజిక న్యాయం లభించిందన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తు నిర్మించిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్నారు.పేదల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి బీఆర్ అంబేదర్ అని కొనియాడారు.
తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం ప్రత్యేక రాష్ట్రాల కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేదర్ అని సీఎం శ్లాఘించారు.ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రపంచమే అబ్బురపడేలా ఉండాలని సూచించారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రపంచమే అబ్బురపడేలా ఉండాలని కేసీఆర్ సూచించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించే సభకు సకల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే గొప్పగా, అంబేదర్ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అంబేదర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేదర్‌ను మాత్రమే ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు. విగ్రహావిషరణ కార్యక్రమం, సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డితో కమిటీ ఏర్పాటుచేశారు.
విగ్రహావిష్కరణ సభకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందిని ఆహ్వానించాలని ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం అవసరమైన 750 ఆర్టీసీ బస్సులను ముందుగానే బుక్ చేసుకోవాలని ఆదేశించారు. విగ్రహావిషరణ తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ అభిమానులు, సామాజిక వేత్తలు, సామాన్యులు కూడా విగ్రహ సందర్శన కోసం వస్తారని, ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.