అన్ని ప్రముఖ పట్టణాలు, టాప్ సిటీలలో పార్కింగ్ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తనదైన శైలిలో పరిష్కరించడానికి ముందుకు వచ్చారు. ఇక నుంచి రాంగ్ పార్కింగ్ ప్రాంతాల్లో ఎవరైనా పార్కింగ్ చేసి వెళ్లిపోతే… దాని ఫొటోను పంపితే ఆ వాహనదారుడికి 1000 రూపాయల జరిమానా విధిస్తారు.
అయితే.. ఆ ఫొటో తీసిన వ్యక్తికి 500 రూపాయలను రివార్డు రూపంలో ఇస్తామని గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. ఇదే తరహాలో కొన్ని రోజుల్లోనే కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తామని వెల్లడించారు. ఇలా చేస్తేనే పార్కింగ్ సమస్య పరిష్కారం అవుతుందని, అందరూ బాధ్యతతో మెలుగుతారని గడ్కరీ అభిప్రాయపడ్డారు.