పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ (Atharva). డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలో పలు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచిన యూనిట్.. తాజాగా వదిలిన టీజర్ తో ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఒక నిమిషం 15 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోతూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ వీడియోలోని క్రైం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచేశాయి. వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీ చేధించేందుకు సైబరాబాద్ క్లూస్ టీమ్ లో జాయిన్ అయిన హీరో.. హంతకులను పట్టుకోవడానికి ఎలాంటి పన్నాగాలు వేశారు? అనే సీన్స్ ఆసక్తికరంగా చూపిస్తూ.. యాక్షన్ సీన్స్ కలగలిపి ప్రేక్షకుల దృష్టిని లాగేశారు మేకర్స్. ఈ వీడియోలో ”ఏరా పద్మవ్యూహంలో పెట్టి పైకి పంపిద్దాం అనుకున్నార్రా.. అసలు వ్యూహం పన్నిందే నేను రా..” అనే డైలాగ్ హైలైట్ కాగా.. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ అయింది.
ఈ సినిమాలో కార్తీక్ రాజు సరసన సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయని.. లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని కోణాలను టచ్ చేశామని అంటున్నారు దర్శకనిర్మాతలు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామారాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
నటీనటులు
కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామారాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు
బ్యానర్: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం: మహేష్ రెడ్డి
నిర్మాత: సుభాష్ నూతలపాటి
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్: విజయ, ఝాన్సీ
సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని