ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రంగ మార్తాండ. ఈ చిత్రానికి ఇళయ రాజా సంగీత దర్శకుడు. కొన్ని రోజులుగా జరుగుతున్న నేపథ్య సంగీతం పూర్తైంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఇళయ రాజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో తాను సంపాదించిన అతిపెద్ద అమూల్యమైన ఆస్తి ఇళయ రాజా అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.
ఇదంతా భగవంతుని ఆశీర్వాదమని, గొప్ప విషయాలు ఏదో ఒక టైమ్ లో ముగిసిపోతాయన్నారు. తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో ఆనందంగా, విజయవంతంగా పూర్తైందని, ఇదో ఆధ్యాత్మిక అనుభవం అంటూ కృష్ణవంశీ ట్వీట్ చేశారు. మరాఠీ సూపర్ హిట్ నట సామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్ గా రంగ మార్తాండ. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు. బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికా, రాజశేఖర్, అలీరేజా తదితరులు ఇందులో నటించారు.