గౌరవ సోదర సోదరీమణులైన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్స్ ప్రతీ ఒక్కరికీ నట్టి కుమార్ చేస్తున్న విజ్ఞప్తి….
ఫిబ్రవరి 19న జరగబోయే కౌన్సిల్ ఎలక్షన్స్ లో జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఒక ఓటు నాకు వేయవలసిందిగా కోరుతున్నాను
దయచేసి నేను చెప్పేది ఒక్కసారి ఆలకించండి….ఆలోచించండి!
నిర్మాత బావుంటే సినిమా రంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుందన్నమాట వేరుగా చెప్పనక్కరలేదనుకుంటాను.
అయితే అన్ని శాఖలకు అన్నం పెట్టే నిర్మాతల పరిస్థితి సినీ పరిశ్రమలో నేడు ఎంత దయనీయంగా ఉందో చూస్తున్నదే. పాము తన పిల్లలను తానే తిన్న రీతిలో కొందరు నిర్మాతల స్వార్ధంతో వేరు కుంపటిగా 21 మంది నిర్మాతలతో ఏర్పడిన గిల్డ్ కారణంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆదాయానికి భారీగా గండిపడింది.యాడ్స్ వంటి వివిధ రూపాలలో వచ్చే ఆదాయాన్ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు రాకుండా గిల్డ్ అడ్డుకట్ట వేసింది. గిల్డ్ లో ఉన్న నిర్మాతలే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేస్తూ స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్నారు. గిల్డ్ కారణంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆదాయానికి గండిపడినప్పటికీ, సి.కల్యాణ్ గారు, టి.ప్రసన్నకుమార్ గారు కౌన్సిల్ ను నిలబెట్టి, సభ్యులందరికీ మెడిక్లెయిమ్ పాలసీని కొనసాగించారు. గిల్డ్ వారు కౌన్సిల్ లో కూడా అడుగుబెడితే అన్నింటికీ మంగళం పాడేస్తారు. ఎట్టి పరిస్థితులలో ఒక్కో సభ్యుడికి 7 లక్షల చొప్పున మెడిక్లెయిమ్ పాలసీని అందించాలన్నదే నా డిమాండ్.
గిల్డ్ ను రద్దు చేయడంతో పాటు ఆ నిధులను కౌన్సిల్ కు తరలించాలి ..
గిల్డ్ ను రద్దు చేయడంతో పాటు ఆ నిధులను కౌన్సిల్ కు తరలించిన తర్వాతే కౌన్సిల్ మెంబర్స్ ను ఓట్లు అడిగే అర్హత గిల్డ్ లో ఉన్న వారికి వస్తుంది. అంతవరకు ఓట్లు అడిగే అర్హతకు వాళ్లు నోచుకోరు.
సభ్యులందరికీ మరోసారి నేను చేసే మనవి ఏంటంటే…..ఓటు అనే ఆయుధంతో కౌన్సిల్ ను నిలబెట్టే బాధ్యతను మెంబర్స్ అంతా తీసుకోవాలి.
మీ
నట్టి కుమార్