Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు… ఇదర్దికి తీవ్ర గాయాలు

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారాలో కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో ఈ ఘటన జరిగింది. గురుద్వారాలో దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. అయితే… మొత్తం ముగ్గురు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక… ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ కాల్పులు వర్ణ వివక్షత విషయంలో జరిగినవి మాత్రం కావన్నారు. అయితే… ముగ్గురు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని, ఈ సమయంలోనే కాల్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts

Latest News Updates