RRR సినిమాతో మంచి కిక్కుమీదున్న రాంచరణ్… మరో అరుదైన ఛాన్స్ ని కొట్టేశాడు. అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ నిర్వహించే అతిపెద్ద షో గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనడానికి అమెరికాకి వెళ్లారు. ఈ షోకి చరణ్ గెస్ట్ గా వెళ్లాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ RRR చిత్రంలోని అనుభవాలు, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల గురించి ఈ షోలో చర్చించనున్నాడు. RRR సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. రేసులో ఈ సినిమానే ముందంజలో వుంది. రామ్ చరణ్ ఫిబ్రవరి 24న జరగనున్న HCA వేడుకలో RRR మూవీ తరపున వెళ్లడం జరిగింది. ఇక ఆస్కార్ అవార్డ్ వేడుక మార్చి 13వ తేదీన జరగనుంది.
ఈ వేడుకకు మాత్రం RRR టీమ్ సభ్యులు మొత్తం పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ మళ్ళీ ఇండియాకు వచ్చిన అనంతరం రాజమౌళి, ఎన్టీఆర్ లతో కలిసి యూఎస్ కు బయలుదే అవకాశం ఉంది. అయితే RRR సినిమాకు సంబంధించిన నాటు నాటు పాట 2023 ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ లో నిలిచిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ పాటకు అకాడమీ అవార్డ్స్ లభిస్తుంది అని సినీ లవర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ RRR దర్శకుడిపై ఊహించని స్థాయిలో ప్రశంసలు కురిపించాడు.