Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

”అరి” సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది – సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలు గా సహ నిర్మాత : లింగారెడ్డి గునపనేని వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అరి. తాజాగా ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ చూసి చాల ఇంప్రెస్ అయిపోయారు.

ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి చిత్ర ట్రైలర్ ను చూశాను. చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. పర్టిక్యులర్ గా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా.. మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. ట్రైలర్ చూడగానే టెక్నీషియన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. మంగ్లీ పాడిన పాట కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను’ అన్నారు.ఈ సంధర్భంగా అశ్వనీదత్ గారికి దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేశారు.

విడుదలకు సిధ్దమవుతున్న ‘అరి’చిత్రంలో నటీనటులు :
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు నటించారు.

సాంకేతిక నిపుణులు
రచన –దర్శకత్వం : జయశంకర్, సమర్పణ : ఆర్ వీ రెడ్డి, నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి , శేషు మారం రెడ్డి , సహ నిర్మాత : లింగారెడ్డి గునపనేని, సంగీతం : అనుప్ రూబెన్స్ , ఎడిటర్ : జి. అవినాష్ , సాహిత్యం : కాసర్ల శ్యాం , వనమాలి, కొరియోగ్రఫీ – భాను, జీతు, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ , స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సినిమాటోగ్రఫీ : శివశంకర వరప్రసాద్, పీఆర్వో – జీఎస్కే మీడియా

Related Posts

Latest News Updates