సూర్యాపేట మునగాల దగ్గర ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో రాజధాని బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు ద్విచక్ర వాహనం, ఇటు ఆర్టీసీ బస్సు రెండూ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. బస్సులో వున్న ప్రయాణికులంతా సురక్షితంగానే వున్నారు. ఈ రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతోంది. మియాపూర్ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర ఘటన జరిగింది. కాగా.. నిన్న ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో సైతం ప్రమాదం జరిగింది.
