ఆస్కార్ వేడుకల అనంతరం ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు తారక్‌కు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న జెండాలు పట్టుకుని జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడాడు. ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఆస్కార్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.
కీరవాణి, చంద్రబోస్ అవార్డు పట్టుకొని స్టేజిపై నిల్చున్నప్పుడు ఆనందగా అనిపించింది. అది మాటల్లో వర్ణించలేనిదని పేర్కొన్నారు. ఆస్కార్ వేడుకల్లో పాలొనడం ఎంతో సంతోషంగా అనిపించిందని, రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయని, అవార్డు వచ్చిన వెంటనే మొదటిగా తన భార్య ప్రణతికి ఫోన్ చేసినట్లు తారక్ చెప్పుకొచ్చాడు.మేము ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రేక్షకులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సులే కారణమని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.