తిరుమల తిరుపతి దేవస్థానానికి మార్చిలో కూడా ఎక్కువ మొత్తంలోనే హుండీ ఆదాయం సమకూరింది. మార్చి మాసంలో 120.29 కోట్ల హుండీ ఆదాయం లభించిందని అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి హుండీ ఆదాయం ప్రతి నెలా వంద కోట్లు దాటుతూ వస్తోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో హుండా కానుకల ద్వారా టీటీడీకి 1,520.29 కోట్ల ఆదాయం లభించింది. భక్తులు స్వామి వారికి మొక్కులు తీర్చుకునేందుకు భారీగా నగదు, విలువైన వస్తువులు సమర్పిస్తున్నారు. దీంతో భారీగా ఆదాయం సమకూరుతోంది.
