Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఉపేంద్ర కంచర్ల హీరోగా పసలపూడి ఎస్.వి. చిత్రం “అనగనగా కథలా”

దర్శకుడిగా తన తొలి చిత్రం “ఏ చోట నువ్వున్నా”తో తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్న యువ ప్రతిభాశాలి పసలపూడి ఎస్.వి రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్ర కంచర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి “అనగనగా కథలా” అనే పేరు ఖరారు చేశారు. ఇది ఉపేంద్ర కంచర్ల నటిస్తున్న నాలుగో చిత్రం కావడం విశేషం. “కంచర్ల, ఉపేంద్ర బి.ఫార్మసీ” చిత్రాలతోపాటు “ఐ.ఎఫ్.సి 369” పేరుతో ఏడు భాషల్లో రూపొందుతున్న వెబ్ సీరీస్ చేస్తున్న ఉపేంద్ర నటిస్తున్న “అనగనగా కథలా” ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని సిబిసి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉపేంద్ర సరసన శుభశ్రీ, నేహాదేశ్ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

దర్శకుడు పసలపూడి ఎస్.వి మాట్లాడుతూ… “తెలుగు సినిమా రంగంలో తనకంటూ తిరుగులేని స్థానం సంపాదించుకోవాలనే వజ్ర సంకల్పం కలిగిన ఉపేంద్ర కంచర్ల హీరోగా “అనగనగా కథలా” చిత్రం రూపొందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రం కూడా నాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, మాటలు: కుమార్ పిచ్చుక, సంగీతం: తరుణ్ రాణా ప్రతాప్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: కొల్లా వెంకట్రావు, నిర్మాత: కంచర్ల అచ్యత్ రావు, కథ – స్క్రీన్ ప్లే – దర్సకత్వం: పసలపూడి ఎస్.వి!!

Related Posts

Latest News Updates