Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఉరుము ఉరిమి.. ‘విరాటపర్వం’పై పడుతుందా? చిక్కుల్లో పడేసిన సాయి పల్లవి ‘పోలిక’

ఉరుము ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లైంది అంటే ఇదేనేమో. ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి పోల్చిన పోలికలు ఇప్పుడు విరాట పర్వం సినిమాకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం సినిమా ఈ నెల 17 న విడుదలకు సిద్ధంగా వుంది. నక్సలిజం నేపథ్యంగా సాగే ఈ సినిమా… సాయి పల్లవికి, అటు రానాకు మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందన్న టాక్ నడుస్తోంది. సాయి పల్లవి కూడా అన్ని ఛానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. అయితే… ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీరీ పండిట్ లకు, గోహత్యకు లింక్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇదే ఇప్పుడు విరాట పర్వం సినిమా కొంపలు ముంచుతోంది. సాయి పల్లవి వ్యాఖ్యలకు గాను నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బ్యాన్ విరాటపర్వం అంటూ సోషల్ మీడియా వేదికగా గరం అవుతున్నారు.

ఇంతకీ సాయి పల్లవి చేసిన పోలిక ఏంటి?

ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూ కొనసాగుతుండగా… ఆ ఇంటర్వ్యూ కాస్త హింస, నక్సలిజం, మంచితనం వైపు మళ్లింది. ఈ సమయంలో కశ్మీర్ పండితుల విషయం కూడా వచ్చింది. అప్పుడు సాయి పల్లవి… ”కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. వాళ్లు అందులో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అని చూపించారు. మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాము. రీసెంట్‌గా ఒక బండిలో ఆవుని తీసుకెళ్తున్నారు. అందులో డ్రైవర్ ముస్లిం. కొంత మంది అతన్ని కొట్టేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే, ఇతరులను బాధించకుండా ఉంటే, లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మంచిగానే ఉంటుంది’’అని అంది.

ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు భగ్గుమంటున్నారు. అసలు ఈ పోలికేంది? అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ రెండు ఘటనలు వేరని, తెలిసీ తెలియకుండా మాట్లాడటం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా విరాటపర్వం సినిమాను తాము బాయ్ కాట్ చేస్తామని, సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీంతో సాయి పల్లవి చిక్కుల్లో పడింది. దీనిపై ఏమైనా వివరణ ఇస్తుందా? చూడాలి.

Related Posts

Latest News Updates