ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’ తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. సరికొత్త ట్రీట్మెంట్ తో, విజువల్స్ తో ట్రైలర్ లో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ తో పాటు రోహన్, క్రితిక శెట్టి మరో జంటగా కనిపించారు. కామెడీ తో యూత్ ఫుల్ కంటెంట్ ని కలిపి పూర్తిగా ఆకట్టుకునే విధంగా చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
