Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎన్టీఆర్‌ 30 లాంఛింగ్ ఈవెంట్‌ వాయిదా.. త్వరలోనే కొత్త తేదీ ప్రకటన

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్‌లో ఒకటి కొరటాల శివ (Siva Koratala)-జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ ఇద్దరి కలయికలో ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా వస్తోంది. కాగా ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 24న లాంఛ్‌ కావాల్సి ఉంది. అయితే నందమూరి తారకరత్న మరణంతో సినిమా ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. సినిమా లాంఛింగ్‌ కొత్త తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 24 న ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించాడు. మార్చిలో షూటింగ్ మొదలు పెట్టి, వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేసే యోచనలో వున్నట్లు తెలిపారు.

Related Posts

Latest News Updates