కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మున్సిపల్ మంత్రి కే. తారక రామారావు మళ్లీ ఫైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులనే లక్ష్యంగా చేసుకొని ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ దర్యాప్తు సంస్థలన్నీ విపక్ష నేతలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయని దునుమాడారు. శ్రీలంక ప్రభుత్వ సీనియర్ అధికారులు పవన విద్యుత్ ఒప్పందంలో ప్రధాని మంత్రి మోదీ టార్గెట్ గా ఆరోపణలు చేసినా… అటు ప్రధాని గానీ,వ్యాపారవేత్త అదానీ కానీ స్పందించలేదని ఎద్దేవా చేశారు. మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు.
శ్రీలంక అధికారులు ఏమన్నారంటే..
శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపుకు ఇచ్చేలా దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఫెర్డినాండో ఆరోపణలు చేశారు. మన్నార్ పట్టణంలో ఉన్న 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఒత్తిడి వల్లే అదానీ గ్రూపుకు ఇస్తున్నామని అధ్యక్షుడు గొటబయ తనతో చెప్పారని ఫెర్డినాండో బాంబు పేల్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
Opposition leaders all over India are routinely targeted & subjected to grilling by ED, CBI & IT
— KTR (@KTRTRS) June 16, 2022
But when senior Sri Lankan Govt officials directly accuse the PM of India & his involvement in wind power contracts
Neither Pradhani Nor Adani respond! Deafening silence from media!