Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎమ్మెల్సీ కవిత కాలు ఫ్యాక్చర్…. మూడు వారాల పాటు విశ్రాంతి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నా కాలికి గాయమైంది. దీంతో 3 వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రజలకు ఏదైనా అవసరాలుంటే కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని కవిత స్పష్టం చేశారు. అయితే… ఈ వార్త విషయంలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కొన్ని రోజుల క్రితమే ఈడీ విచారణకు హాజరయ్యారు. మళ్లీ కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates