ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జి అనంతరామును బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జి జయలక్ష్మిని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. రజిత్ భార్గవను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీడిసిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాటు టూరిజం, సాంస్కృతిక శాఖలకు ఫుల్ ఎడిషనల్ చార్జితో కొనసాగించనున్నారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోనూ ఆయనే చీఫ్ సెక్రటరీగా కొనసాగునున్నట్టు వెల్లడించారు. మహ్మద్ ఇంతియాజ్‌ను మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జి లక్ష్మి షాను గ్రామ వార్డు విలేజ్ వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.