ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి పరిశ్రమల నిర్వాహకులకు భారీ ఊరట కల్పించింది. నిర్వహణ భారంగా మారి, మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్ సర్వీసును తిరిగి కల్పించేందుకు కనిష్ఠ ఛార్జీలే వసూలు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. ఈ నిబంధన మార్చి 31 వరకు మాత్రమే వుంటుందని స్పష్టం చేసింది.
ఈ స్కీం కింద విద్యుత్ పునరుద్ధరణ చేసే పరిశ్రమల సమాచారం మూడు నెలలకోసారి తమకు అందివ్వాలని కూడా ఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది. కోవిడ్ కారణంగా ఘోరంగా దెబ్బతిని, మూతపడ్డ పరిశ్రమలు మళ్లీ ఇప్పడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి పరిశ్రమలకు ఏపీఈఆర్సీ ఈ వెసులుబాటును కల్పిస్తోందని అధికారులు ప్రకటించారు.