ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుమారుడి వివాహం కారణంగా అప్పలనాయుడు ఆలస్యంగా వచ్చి ఓటు వేశారు. వివాహం అనంతరం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడకు వచ్చి వైసీపీ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అప్పలనాయుడు కోసం వైసీపీ చాపర్‌ను పంపించింది. విశాఖ నుంచి గన్నవరంకు వైసీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీకి చేరుకుని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా, వైసీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేనకు ఓ సభ్యుడు వున్నారు.
అయితే… టీడీపీకి నలుగురు మాత్రం దూరంగా వుంటున్నారు. దీంతో టీడీపీ సంఖ్య 19 మాత్రమే వుంది. ఒక్కో ఎమ్మెల్సీగెలుపుకు 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. అయితే.. వైసీపీ 7 స్థానాల్లోనూ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే.. టీడీపికి గెలిచేంత బలం లేకపోయినా… తన అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పటి వరకూ 107 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలువడతాయి.