రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్, గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ పొందనున్నారని, ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నట్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ప్రకటించారు. మార్చి 6న ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుందని తెలిపారు. మార్చి 23 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఆ తర్వాత కొద్దిసేపటికి ఫలితాలు వెల్లడిస్తారని వివరించారు.
ఇక.. ఏపీలోని త్వరలో ఖాళీకానున్న 7 స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, పెన్మత్స వరాహ వెంటక సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం మార్చి 29 తో ముగియనుంది. ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన చల్లా భగీరథ రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో… ఆ స్థానం కూడా ఖాళీగా వుంది.
ఇదీ షెడ్యూల్…
నోటిఫికేషన్ : మార్చి 6
నామినేషన్లకు చివరి తేదీ : మార్చి 13
నామినేషన్ల పరిశీలన : మార్చి 14
నామినేషన్ల ఉపసంహరణ : మార్చి 16
ఎన్నికలు : మార్చి 23
కౌంటింగ్ : మార్చి 23