ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీటీడీ ఆహ్వానించింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ కి ఆహ్వాన పత్రికను అందజేశారు. కోదండరామ స్వామి కల్యాణ మహోత్సవానికి రావాలని ఆహ్వానం పలికారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ని కూడా కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏప్రిల్ 5 న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ సీతారామ కల్యాణ మహోత్సవం జరగుతుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 9 వరకూ ఒంటిమిట్టలో రామ నవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.