కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మే 10 న పోలింగ్ జరగనుంది. మే 13 న తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు ఏప్రిల్ 13 న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 20 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
అయితే… నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.ఇక… 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వ్రుద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు వున్నారు. కర్నాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ స్థానాలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కర్నాటకలో 58, 282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.