ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి గుజరాత్ హైకోర్టు నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మోదీ చదివిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్లను అందజేయవలసిన అవసరం ప్రధాన మంత్రి కార్యాలయానికి లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. రెండేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన న్యాయస్థానం… కేజ్రీవల్ కి 25 వేల జరిమానా కూడా విధించింది.
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల విషయంలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల కోసం 2016 లో కేంద్ర సమాచార కమిషన్ కి కేజ్రీవాల్ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వాటిని చూపించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సమయంలోనే సీఐసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం… యూనివర్శిటీ గానీ, పీఎంవో గానీ… మోదీ సర్టిఫికేట్లను చూపించాల్సిన అవసరమే లేదని తీర్పునిచ్చింది.