తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై గన్ పార్కు అమరవీరుల స్థూపం దగ్గర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. బీజేపీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరిన బండి.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాలులు అర్పించి దీక్ష ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీక్ చేసి లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేపర్ లీకేజీపై ఇంత జరుగుతున్నా సీఎం కనీసం నోరు మెదపడం లేదని, పేపర్ లీక్ పై తక్షణమే స్పందించి, సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే… గన్ పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే… ఈ సమయంలోనే బండి సంజయ్ ని పోలీసులు బలవంతంగా లాక్కెల్లారు.
గన్ పార్కు నుంచి ర్యాలీగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బయలుదేరిన బండి సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ పాలనలో నీళ్లు – నిధులు – నియామకాల్లోనూ అక్రమాలే అని అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ కూతురు కోసం పేపర్ లీకేజీ చేస్తారా అని ప్రశ్నించారు. దగుల్బాజీ రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో… అందుకు భిన్నంగా పాలన సాగుతోందన్నారు.