గుంటూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి దుండగులు ఈ నిప్పుపెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీస్‌కు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రిందటే బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరూ లేని సమయంలో ఆరుగురు వ్యక్తులు వచ్చి, పెట్రోల్ పోసి, కార్యాలయానికి నిప్పు అంటించారని వాచ్ మెన్ పేర్కొన్నాడు. అగ్ని ప్రమాదం సంభవించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే… ఇది ఎమ్మెల్యే కోటంరెడ్డియే చేయించారని అనిల్ కుమార్ ఆరోపించారు.
