ఓటర్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకూ గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది. గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఓటర్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించే గడువు ఏప్రిల్ 1 తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ 6బీని సమర్పించాలి.
ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నాటికి 54.32 కోట్ల ఆధార్ సంఖ్యలను కేంద్రం సేకరించింది. కానీ.. వీటిని అనుసంధానించే ప్రక్రియను మాత్రం ప్రారంభించలేదు. ఓటర్ కార్డు కలిగిన వారు ఆన్‌లైన్‌లోనే ఈ ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. స్వచ్ఛందం ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు.