టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తండ్రిగా ప్రమోషన్ కొట్టాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నానని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ స్పెషల్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. బేబీ మూన్.. నా చేతుల్లోకి నిన్ను ఎప్పుడు తీసుకొని ముద్దాడుతానో… అందుకు ఎదురు చూస్తున్నానని అన్నాడు. పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా వుందని, గొప్పగా కూడా వుందన్నాడు. కొత్త జీవితం, కొత్త ప్రయాణం అంటూ భార్య బేబీతో కలిసిన ఫొటోలను షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ వారు, నెటిజన్స్ అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.
https://twitter.com/Naveenc212/status/1625394331560574976?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1625394331560574976%7Ctwgr%5E30d3f65b2e8cce203ee5c8b17a54d6dac4e82e72%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fnaveen-chandra-will-become-father-soon-shares-wife-baby-bump-pics-1525811