తెలంగాణలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. శుక్రవారం TSPSC కీలక సమావేశం జరిగింది. సిట్ నివేదికను పరిగణనలోకి తీసుకునే… పై నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను 2022, సెప్టెంబర్ 16న నిర్వహించారు. రద్దు చేసిన ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
సిట్ నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. 2023, జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు.పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో TSPSC ట్రాక్ రికార్డు తీవ్రంగా దెబ్బతిన్నది.
టీఎస్‌పీఎస్సీ నుంచి ఐదు పేపర్లు లీక్ అయ్యాయని సిట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందా లేదా అనే విషయం దర్యాప్తు తర్వాత చెప్తామన్నారు. ఇన్వెస్టిగేషన్ సీరియస్‌గా చేస్తున్నామని అన్నారు. కంప్యూటర్ లాన్‌లోకి వెళ్లి పేపర్లను తమ పెన్ డ్రైవ్‌లోకి తీసుకున్నారని… రాజకీయ నాయకుల ఫోటోలు దొరికాయని.. వారి పాత్ర ఉందా లేదా అనేది విచారణ చేయాలని చెప్పారు. విచారణను సీరియస్‌గా చేస్తున్నామని అన్నారు. కంప్యూటర్ లాన్‌లోకి వెళ్లి పేపర్లను తమ పెన్ డ్రైవ్‌లోకి తీసుకున్నారని… రాజకీయ నాయకుల ఫోటోలు దొరికాయని.. వారి పాత్ర ఉందా లేదా అనేది విచారణ చేయాలని చెప్పారు.
2022, అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను 2023, జనవరి 13వ తేదీ విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. 503 గ్రూప్-1 పోస్టులకు 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 85 వేల 916 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 25 వేల మంది మెయిన్స్ కి ఎంపికయ్యారు. ఈలోపే లీకేజీ వెలుగు చూడటంతో వివాదం రేగింది.