నటుడు తారకరత్నను చికిత్స కోసం కుటుంబ సభ్యులు విదేశాలకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. వైద్యులు ఇచ్చే రిపోర్టులను బట్టి, మెదడు పరిస్థితి ఎలా వుందని తెలుస్తుందని పేర్కొన్నారు. దాన్ని బట్టి కుటుంబసభ్యులు తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కాగా జనవరి 27న 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన తారకరత్న మెదడులో మెదడులో నీరు చేరి మెదడు వాచిందని, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని వైద్యులు తెలిపారు. టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తాజాగా… తారకరత్న ఆరోగ్యంపై వైద్యులనుఅడిగి తెలుసుకున్నారు. తారకరత్నను బాలక్రుష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని పేర్కొన్నారు.
తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో తారకరత్న వైద్య ఖర్చు గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి చర్చలు కూడా నడుస్తున్నాయి.వైద్య ఖర్చులకు లక్షలు ఖర్చవుతున్నాయని, అలాగే మెరుగైన చికిత్సను అందించడానికి ఇప్పటికే కోటి పైగా హాస్పిటల్ ఖర్చులు అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ ఖర్చులను స్వయంగా నారా లోకేష్ భరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.