కళాతపస్వీ అంటే కళా తపస్వే. కళను ఓ తపస్సుగా ఆరాధించారు. అందుకే ఆయన తీసిన సినిమాలు ఆణిముత్యాల్లా గుర్తుండి పోయాయి. అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. అన్నింటికంటే…. కొన్ని సినిమాలు ఆయనకు అపరిమిత ప్రాచుర్యాన్ని తెచ్చి పెట్టాయి. శంకరాభరణం, సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం… ఈ ఐదు చిత్రాలూ అమిత ప్రాచుర్యాన్ని సంపాదించాయి. ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా లభించాయి.
1980 లో విడుదలైన ”శంకరాభరణం” అఖండ విజయం సాధించింది. ఇప్పటికీ గుర్తుంటుంది సినిమా. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ అవార్డు, ఉత్తమ సంగీత దర్శకునిగా కె.వి. మహదేవన్ (రజత కమలం 50 వేలు), ఉత్తమ గాయకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (రజత కమలం 50 వేలు), ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్ రజత కమలం 50 వేలు అందుకున్నారు. మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపేయాలన్న సంకల్పంతో విశ్వనాథ్ ఈ సినిమా తీశారు. 1981 లో ఈ సినిమా విడుదల కాగా.. నర్గీస్ దత్త్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు దక్కించుకుంది.
ఇక… అమాయకంగా కమల్ హసన్ అద్భుతంగా నటించిన చిత్రం ”స్వాతిముత్యం”. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీకి మళ్లీ వివాహం చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చే సినిమా. కమల్ హసన్ నటించిన నటన అజరామరం. తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు అందుకుంది.
ఇక…. 1989 లో ”సూత్రధారులు” అనే సినిమా అంతే విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డును పొందింది. 2004 లో వచ్చిన స్వరాభిషేకం సినిమా. ఇందులో విశ్వనాథ్, శ్రీకాంత్ నటించారు. లయ కీలక పాత్ర పోషించింది. తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డు అందుకుంది.