చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా గందరగోళంగానే కొనసాగుతున్నాయి. చివరి రోజు కూడా టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సస్పెన్షన్ వేటు వేశారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సమయంలోనే టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్ాడుతూ… నవ రత్నాల్లో భాగంగా 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చామని, టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా మొత్తం అవినీతే జరిగిందంటూ విమర్శలు చేశారు. దీంతో టీడీపీ తీవ్ర నిరసనకు దిగింది. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పోడియం వైపు వెళ్లారు. దీంతో స్పీకర్ వారందర్నీ సస్పెండ్ చేశారు.
