బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టే విస్తృత కార్యక్రమాల అమలు కోసం అన్ని జిల్లాలకు ఇన్‌చార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రకటించారు. పార్టీ శ్రేణులను ఏకం చేసేలా ఆత్మీ య సమ్మేళనాలు, డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలలపాటు విస్తృతంగా చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహిం చి దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షు లు, స్థానిక ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్‌చార్జీలు వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాల ప్రణాళిక, అమలుపై చర్చించాలని సూచించారు.
హైదరాబాద్ – దాసోజు శ్రవణ్
వనపర్తి, జోగుళాంబ గద్వాల – తక్కళ్లపల్లి రవీందర్ రావు
మేడ్చల్ – పల్లా రాజేశ్వర్ రెడ్డి
కరీంనగర్, సిరిసిల్ల- బస్వరాజు సారయ్య
నల్లగొండ- కడియం శ్రీహరి
వికారబాద్ – పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి- ఎల్. రమణ
భద్రాద్రి కొత్తగూడెం- టి. భానుప్రసాద్ రావు
సంగారెడ్డి- వెంకట్రాం రెడ్డి
మెదక్- ఎగ్గే మల్లేశం
మహబూబ్ నగర్, నారాయణ పేట – కసిరెడ్డి నారాయణ రెడ్డి
యాదాద్రి – యాదవ రెడ్డి
నాగర కర్నూలు- పట్నం మహేందర్ రెడ్డి
భూపాలపల్లి, ములుగు – అరికెల నర్సారెడ్డి
సిద్దిపేట – బోడకుంట్ల వేంకటేశ్వర్లు
హన్మకొండ- వరంగల్- ప్రభాకర్
నిర్మల్, ఆదిలాబాద్ – వి. గంగాధర్ గౌడ్
మంచిర్యాల, ఆసిఫాబాద్- నారదాసు లక్ష్మణ్
జనగామ- కోటిరెడ్డి
మహబూబాబాద్ – పురాణం సతీశ్
కామారెడ్డి- దండె విఠల్
నిజామాబాద్- బండ ప్రకాశ్
జగిత్యాల- కోలేటి దామోదర్
పెద్దపల్లి- ఎర్రోళ్ల శ్రీనివాస్
ఖమ్మం- శేరి సుభాష్ రెడ్డి
సూర్యాపేట – మెట్టు శ్రీనివాస్