తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈయన కుటుంబంతో పాటు జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇంటిలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ ఆయన ఆస్తి పత్రాలను, ఇతరత్రా కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. మొత్తం 20 మంది ఈడీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అయితే ఈ సోదాలు కొనసాగుతున్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనే వున్నారు.