సూపర్ స్టార్ రజనీకాంత్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెల్సన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా టైటిల్ కూడా ఖరారైపోయింది. జైలర్ అన్న పేరుతో రజనీకాంత్ తెరపై కనిపించనున్నారు. ఈ జైలర్ తో రజనీకాంత్ కెరీర్ లో 169 వ సినిమా అవుతుంది. జైలర్ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది.

జైలు ఖైదీల నేపథ్యంగా ఈ చిత్రం ఉండే ఛాన్స్ వుంది. ప్రతిష్ఠాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ దీనిని నిర్మిస్తుననాడు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు ఇస్తున్నాడు. ఇక.. రజనీ సరసన అగ్రతార ఐశ్వర్యరాయ్ నటించే ఛాన్స్ వుందని తెలుస్తోంది. జూలై నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
https://twitter.com/sunpictures/status/1537668933205229568?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1537668933205229568%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fmovie-news%2Fthalaivar-169-movie-title-announced-as-jailer-182435.html