తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం లభించింది. వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సాంబారెడ్గికి టాప్ శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కింది. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ తాజాగా ప్రకటించిన టాప్ శాస్త్రవేత్తల జాబితాలో ఈయనకు చోటు దక్కింది. ప్రస్తుతం టెక్సాస్ లోని ఏ అండ్ ఎం యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసన్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈయన ఫార్మా రీసెర్చర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలు చేసి, రికార్డుల్లోకెక్కారు.

వరంగల్ లోని పరకాల మండలంలోని చర్లపల్లిలో డాక్టర్ దూదిపాల సాంబారెడ్గి జన్మించారు. కాకతీయ యూనివర్శిటీలో ఫార్మసీ విద్య పూర్తి చేసేశారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. న్యూరోథెరాప్యూటిక్స్ లో గ్లోబల్ లీడర్ గా వుంటూ… అనేక మందికి మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈయన 215 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించారు. వంద మందికి పైగా స్కాలర్లకు గైడ్ గా కూడా వున్నారు.