కోల్ కతాలో ఓ ట్రాఫిక్ పోలీస్ చేసిన సేవ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. పని చిన్నదైనా, పెద్దదైనా.. ముందుకు వచ్చి చేసేవాడే నిజమైన ఆదర్శవంతుడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కోల్ కతాలో అది బిజీ టైమ్. అందరూ ఆఫీస్ లకు వెళ్లే సమయం. ఆ సమయంలో ట్రాఫిక్ డ్యూటీ చేయడమంటే మామూలు విషయం కాదు.
ట్రాఫిక్ పోలీసులకు విపరీతమైన ఒత్తిడి వుంటుంది. ఈ ఒత్తిడిలో కూడా ఓ కానిస్టేబుల్ సమాజ సేవ చేయడం అందరూ మెచ్చుకుంటున్నారు. రోడ్డుపై వున్న కంకర రాళ్లను ఆయన తొలగించాడు. ఆ ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరిచాడు. ఇలా రోడ్డుపై కంకర ఉన్న సమయంలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడేవారు. చాలా మంది కిందపడ్డ సందర్భాలూ వున్నాయట. దీనిని గమనించిన ఆ కానిస్టేబుల్ వెంటనే అక్కడి కంకరను తొలగించి.. రోడ్డును ప్రయాణానికి అనుకూలంగా చేసేశాడు.
ఈ వీడియోను ఛత్తీస్ గఢ్ కు చెందిన అవినాశ్ శరన్ అనే ఐఏఎస్ అధికారి పోస్ట్ చేశారు. అయితే పోలీస్ చేస్తున్న పనికి ఓ యువకుడు కూడా సహాయం అందించాడు. ఆయన వెనక వుంటూ.. నెమ్మదిగా వెళ్లాలంటూ వాహనదారులకు సూచించారు. వారికి తోవ కూడా చూపించారు. ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ కు ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపారు. డ్యూటీ కంటే.. మానవత్వమే ముఖ్యం అంటూ తెగ ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/AwanishSharan/status/1537398820828594176?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1537398820828594176%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fviral-video-traffic-cop-sweeps-busy-road-to-help-commuters-internet-salutes-him-3075006