ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మొదట సీఎం జగన్ భేటీ అవుతున్నారు. ఈ భేటీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపైనే చర్చించనున్నారు. అయితే… ఈ నెల 16 న ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అయితే.. రెండు వారాల వ్యవధిలోనే జగన్ మళ్లీ ప్రధానితో భేటీ అవుతుండటం ఆసక్తి రేపుతోంది. ఏపీలో రాజకీయం క్రమక్రమంగా మారిపోతోంది. అలాగే.. విధానపరంగా పోలవరం ఎత్తు గురించి కూడా కేంద్రం లోక్ సభ వేదికగా కీలక ప్రకటన కూడా చేసింది. ఈ అన్ని పరిణామాలు కూడా ఈ పర్యటన సందర్భంగా ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ వుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
