ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు కవిత ఈడీ ముందుకు వెళ్లనున్నారు. 11 దాటినా… ఎమ్మెల్సీ కవిత తన నివాసం నుంచి ఇంకా ఈడీ విచారణకు బయల్దేరలేదు. మరోవైపు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక…. ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. ఇక.. కవితకు సంబంధించిన ఇవాల్టి ఈడీ విచారణ విషయానికొస్తే.. అరుణ్ పిళ్లైతో (Arun Pillai) కలిపి కవితను ప్రశ్నించాలని ఈడీ డిసైడ్ అయింది. నేడు బుచ్చిబాబును కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఇదే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి (Magunta Raghava Reddy) బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తీవ్రమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చందన్‌రెడ్డిని క్రూరంగా కొట్టారని, దాంతో ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు.