తాను మరణించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తీవ్ర అసహనం వ్యక్తం చేవారు. తాను బతికేవున్నానని, ఆరోగ్యంగానే వున్నానని ప్రకటించారు. తాను మరణించినట్లు వస్తున్న వదంతులను మాత్రం నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.
రేపు జరుగబోయే ఉగాది పండుగ ఏర్పాట్లు చూసుకుంటున్న తనకు ఇలా వరుసగా చాలా ఫోన్ కాల్స్ రావడం ఆందోళన కలిగించిందని చెప్పారు. అదే కొంచెం పెద్ద వాళ్లైతే నిజంగా గుండె ఆగిచనిపోయారని ఆయన తెలిపారు. ఆ వార్తల వల్ల తన ఇంటి వద్ద భద్రత కోసం ఏకంగా 10 మంది పోలీసులు వచ్చారని కోటా బాధను వ్యక్తం చేశారు. పాపులారిటీ, డబ్బు కావాలంటే వేరే మార్గాల్లో సంపాదించుకోవచ్చని, ఇలా పుకార్లను వ్యాప్తి చేయడం మంచి కాదని హెచ్చరించారు. మనుషుల జీవితాలతో ఆడుకోవడం.. దారుణమైన విషయమని చెప్పారు.