తెలంగాణలోని వివిధ యూనివర్శిటీల్లో చదువుతున్న విద్యార్థులందరూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ కు వివరించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరగా… అందుకు గవర్నర్ సమ్మతించారు. అదే విధంగా విద్యార్థులకు మంచి ఆహారం, నాణ్యమైన విద్య, వసతి, ఉద్యోగం అందించాల్సిన అవసరం ఉందని గవర్నర్ నొక్కి వక్కానించారు. అయితే… విద్యార్థులు గవర్నర్ తమిళిసైను కలవడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
