తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్ పర్సన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు వున్న సీఎస్ సోమేశ్ కుమార్ కూడా రెరా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే… సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో రెరా చైర్మన్ పదవీ ఖాళీ అయ్యింది. కొత్త వారి కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దరఖాస్తు తేదీ ఈ నెల 3 తో ముగిసింది. అయితే.. ఈ ప్రక్రియ కొలిక్కి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వారి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ రెరా చైర్ పర్సన్ గా సీఎస్ శాంతి కుమారిని నియమిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.
