Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి 12 వ తేదీ వరకూ గోవిజ్ఞాన పరీక్షలు

గోసేవా విభాగం తెలంగాణ ఆధ్వర్యంలో విజ్ఞాన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 12 వరకూ ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. భారతీయ గోవుల వైజ్ఞానిక విశేషాలు, ప్రత్యేకతలు, ధార్మిక వైదిక విజ్ఞానం గురించి, ఆరోగ్య విశిష్టతలపై మాధ్యమిక తరగతుల నుంచి యూనివర్శిటీ స్థాయి వరకూ, అన్ని వర్గాల వారికి ఈ పరీక్ష నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో నిర్వహిస్తారు.

ఆన్ లైన్ ద్వారా పరీక్షల్లో పాల్గొనవచ్చని సూచించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు http://gouvigyan.in ను సందర్శించవచ్చని సూచించారు. మరోవైపు దీనికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను ఆరెస్సెస్ ప్రాంత కార్యవాహ్ కాచం రమేష్ , ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, ప్రాంత సహ సంఘచాలక్ శ్రీ సుందర్ రెడ్డి, గో విజ్ఞాన పరీక్ష ఆయామ్ ప్రముఖ్ శ్రీ కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

Related Posts

Latest News Updates