Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. మొదటి సంతకం ఏ ఫైల్ పై అంటే…

తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం సచివాలయంలోని 6 వ అంతస్తులోని తన ఛాంబర్ కి వెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. ఇలా మొత్తం 6 ఫైళ్లపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. పోడు భూముల పంపిణీ, నగరంలో లక్ష బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, గ్రుహ లక్ష్మీ సహా పలు ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. అనంతరం సమయంలో సీఎం కేసీఆర్​కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అంతకు ముందు ఎలక్ట్రిక్​ వాహనంలో పలు ఛాంబర్​లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు సీఎం ని అభినందించారు.

ఇక… రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తమకు కేటాయించిన ఛాంబర్లలో ప్రత్యేక పూజలు చేసి, తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రులకు, వారి కుటుంబీకులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంత‌రం ప‌లు ద‌స్త్రాల‌పై సీఎం కేసీఆర్, మంత్రులు సంత‌కాలు చేశారు.

 

సీఎం కేసీఆర్ – కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ద‌స్త్రం
కేటీఆర్ – జీహెచ్ఎంసీ ప‌రిధిలో డబుల్ బెడ్రూంల కేటాయింపు మార్గ‌ద‌ర్శ‌కాలు
హరీష్ రావు – టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ న‌ర్సుల‌ డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ద‌స్త్రం
తలసాని శ్రీనివాస్ యాదవ్ – ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ ద‌స్త్రం

నిరంజన్ రెడ్డి – సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా ద‌స్త్రం
గంగుల కమలాకర్ – ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్‌వాడీల‌కు మే నెల నుంచి పోషకాల సన్నబియ్యం అందించే ద‌స్త్రం
కొప్పుల ఈశ్వర్ – దళిత బంధు రెండో విడత ద‌స్త్రం
ఇంద్రకరణ్ రెడ్డి – జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాలయాల్లో దూపదీప నైవేద్య ప్రారంభం ద‌స్త్రం

జ‌గ‌దీశ్ రెడ్డి – వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ద‌స్త్రం
స‌బితా ఇంద్రారెడ్డి – ట్యాబ్‌లు, లైబ్రరీ కార్న‌ర్ ద‌స్త్రం
స‌త్య‌వ‌తి రాథోడ్ – రాంజీ గోండు మ్యూజియానికి రూ. 10 కోట్ల కేటాయింపు ద‌స్త్రం
శ్రీనివాస్ గౌడ్ – సీఎం క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు రూ. 3.2 కోట్ల మంజూరు ద‌స్త్రం

మహమూద్ అలీ – కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరు ద‌స్త్రం
వేముల ప్రశాంత్ రెడ్డి – రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ద‌స్త్రం
మల్లారెడ్డి – శ్రమ శక్తి అవార్డుల ద‌స్త్రం
దయాకర్ రావు – ఐకేపీ గ్రూపులకు మండలాల వారీగా కొత్త భవనాల ద‌స్త్రం

 

Related Posts

Latest News Updates