తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది. మరి కాసేపట్లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించనున్నారు. ఈ రైలు నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ేసీ చైర్ కార్ టిక్కెట్ ధర 1680 గా వుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్ ధరను 3080గా నిర్ణయించారు. అదే, తిరుపతి నుంచి సికింద్రాబాద్ కి ఏసీ చైర్ కార్ టిక్కెట్ ధర 1625, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధరను 3030లుగా నిర్ణయించినట్లు తెలిపారు. సికింద్రాబాద్- తిరుపతి టిక్కెట్ బేస్ ఫేర్ ను 1168 రూపాయలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ ఛార్జీ 40 రూపాయలు, సూపర్ ఫాస్ట్ ఛార్జీ 45 రూపాయలు, మొత్తం జీఎస్టీ 63 రూపాయలుగా నిర్ణయించారు. రైల్లో ఆహార పదార్థాలకు గాను 364 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. అదే తిరుపతి- సికింద్రాబాద్ రైల్లో బేస్ ఛార్జీని 1169 గా ప్రకటించారు. కేటరింగ్ ఛార్జీని మాత్రం 308 రూపాయలుగా పేర్కొన్నారు.
సికింద్రాబాద్ నుంచి ఒక్కో స్టేషన్ కి ధరలు ఇలా వుంది.
సికింద్రాబాద్- నల్లగొండ – 470
సికింద్రాబాద్- గుంటూరు- 865
సికింద్రాబాద్ – ఒంగోలు- 1075
సికింద్రాబాద్- నెల్లూరు – 1270
సికింద్రాబాద్ – తిరుపతి -1680
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీలు
సికింద్రాబాద్- నల్లగొండ – 900
సికింద్రాబాద్- గుంటూరు- 1620
సికింద్రాబాద్ – ఒంగోలు- 2045
సికింద్రాబాద్- నెల్లూరు – 2455
సికింద్రాబాద్ – తిరుపతి -3080
తొలి రోజు సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి తిరుపతికి రాత్రి 9.00 గంటలకు చేరుకుంటుంది. తొలిరోజు మాత్రం చర్లపల్లి 11.45, నల్గొండ 13.05, మిర్యాలగూడ 13.40, పిడుగురాళ్ల 14.30, గుంటూరు 15.35, తెనాలి 16.15, బాపట్ల 16.50, చీరాల 17.10, ఒంగోలు 17.50, నెల్లూరు 19.10, గూడూరు 19.35, తిరుపతి 21.00 గంటలకు ట్రైన్ చేరుతుంది. వందేభారత్ 16 కోచ్‌ల రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్, సాధారణ చైర్‌కార్ బోగీలు ఉంటాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం తగ్గనుంది.