కరీంనగర్‌లో సినిమా విజయోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్‌లో నిర్వహిస్తున్న దసరా సినిమా విజయోత్సవ సభ పోస్టర్(Poster)ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ యాసతో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ నటించిన ‘దసరా ’ చిత్రం విజయోత్సవ సభ కరీంనగర్‌లోని స్థానిక ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో సాయంత్రం నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
తెలంగాణ కుటుంబ నేపథ్యం, బంధాలు అనుబంధాల గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కు చెందిన వేణు నిర్మించిన బలగం సినిమా విజయవంతమై కరీంనగర్‌లో విజయోత్సవ సభ నిర్వహించారని గుర్తు చేశారు. సింగరేణి బొగ్గు గని జీవితాల నేపథ్యంతో తీసిన దసరా సినిమా విజయవంతం అవడం ఈ సినిమా విజయోత్సవ సభ కరీంనగర్ లో జరపడం అభినందనీయమని మంత్రి గంగుల పేర్కొన్నారు.